బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 21:44:15

శ్రీకృష్ణావతారంలో భద్రాద్రి రామయ్య

 శ్రీకృష్ణావతారంలో భద్రాద్రి రామయ్య

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా  రామయ్య స్వామి శ్రీకృష్ణావతారంలో దర్శనమిచ్చారు. శ్రీకృష్ణావతారంలో అలంకరించిన స్వామి వారికి బేడా మండపంలో ఊంజల్‌ సేవను ఘనంగా జరిపారు. స్వామి వారి తొమ్మిదవ అవతారాన్ని దర్శించుకోవటానికి భక్తులు బారులు తీరారు. 

ముక్కోటికి భద్రాద్రి సిద్ధం..:

ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా గురువారం జరిగే తెప్పోత్సవం, శుక్రవారం జరిగే ఉత్తర ద్వార దర్శనానికి భద్రాచలం ముస్తాబైంది. ఈ మేరకు దేవస్థానం ఆధ్వర్యంలో రామాలయం విద్యుత్‌ దీపాల అలంకరణతో పాటు అన్ని పనులను పూర్తి చేశారు. కాగా తెప్పొత్సవం, ఉత్తర ద్వార దర్శనాన్ని అంతరంగికంగా కేవలం వైదిక పెద్దలు, వేదపారాయణదారులు, అర్చకుల సమక్షంలోనే నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.  

ఇవి కూడా చదవండి:

బాక్సింగ్‌ డే టెస్టు నుంచి వార్నర్‌, అబాట్‌ ఔట్‌

ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్‌కూ షమీ డౌటే!


logo