భద్రాచలం, ఫిబ్రవరి 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. భద్రాచలం మండలంలోని ఐదు పంచాయతీలను కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా ఏపీలో విలీనం చేసిందని, వాటిని తిరిగి తెలంగాణ లో కలుపాలని డిమాండ్ చేస్తూ గురువారం అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వ్యాపార సముదాయాలను మూసి ఉం చారు. బస్సులు, ఆటోలు తిరగకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బంద్కు పట్టణవాసులు సైతం స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించడంతో రోడ్లన్నీ నిర్మానుష్యం గా మారాయి. ఈ సందర్భంగా నిర్వహించిన నిరసనలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు.