హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): సీజనల్ వ్యాధుల వల్ల పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశమున్నదని, సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సోమవారం టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కొత్త టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మెడికల్, డయాగ్నస్టిక్స్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్ కొనుగోళ్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలని సూచించారు. కార్పొ సెంట్రల్ మెడిసిన్ స్టోర్లలో కనీసం 3 నెలలకు సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.
హాస్పిటల్ స్థాయి బట్టి ఏ హాస్పిటల్లో ఏయే ఎక్విప్మెంట్ ఉండాలో ఒక స్టాం డర్డ్ లిస్టు తయారు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం నిమ్స్ డెరెక్టర్ బీరప్ప, డీఎంఈ నరేంద్రకుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్ సభ్యులుగా కమిటీని నియమించారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, డాక్టర్ నరేంద్రకుమార్, హెల్త్ డైరెక్టర్ డాక్టర్ తదితరులు పాల్గొన్నారు.