Influencers | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియాలో కొందరు ఇన్ఫ్లూయెన్సర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. సైబర్ మోసగాళ్లు ఇచ్చే డబ్బులకు కక్కుర్తిపడి యూ ట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమా ల ద్వారా బెట్టింగ్ యాప్‌లు, లోన్ యాప్‌లను అడ్డగోలుగా ప్రమోట్ చేస్తూ తమను గుడ్డిగా ఫా లో అవుతున్నవారిని ఇరకాటంలో పెడుతున్నా రు. మొదట ఏవేవో ఆసక్తికరమైన వీడియోలు చేస్తూ, సూక్తులు చెబుతూ టీనేజర్లను ఆకట్టుకుంటున్నారు. అలా ఫాలోవర్లు, సబ్‌స్ర్కైబర్లు పెరగ్గానే నిషేధిత బెట్టింగ్ యాప్‌ల ద్వారా తెలివిగా బెట్టింగ్‌లు పెట్టిస్తున్నారు.
‘మీకు ఐఫోన్-15 కావాలా? ఖరీదైన వాచ్ లు కావాలా? అయితే వెంటనే నా చానెల్‌ను సబ్‌స్ర్కైబ్ చేసి, కింద ఉన్న టెలిగ్రామ్ లింక్‌ను ఓపెన్ చేయండి. అందులో నా చానల్లో జా యిన్ అవ్వండి. నేను అడిగే ప్రశ్నలకు సమాధా నం చెప్పండి. లేదంటే చిన్న చిన్న గేమ్స్ ఆడి ఐ ఫోన్లను సొంతం చేసుకోండి. గేమ్‌లో గెలిచి ప్ర తిరోజూ డబ్బులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు పొందం డి. జాగ్రత్తగా ఆడండి’ అంటూ ఓ ఇన్ఫ్లూయెన్సర్ తన యూట్యూబ్ అకౌంట్లో ఉన్న దాదా పు 4.22 మిలియన్ మంది సబ్‌స్ర్కైబర్లకు రో జూ ఆశపెడుతున్నాడు. అతను ఇచ్చిన లింక్‌ను ఓపెన్‌చేస్తే నేరుగా అతని టెలిగ్రామ్ చానల్ ఓపె న్ అవుతుంది.
అందులో వీడియో కింద ఇచ్చిన ఏపీకే ఫైల్ లింక్‌ను ఓపెన్ చేయగానే ‘1విన్’ అ నే బెట్టింగ్ యాప్ ఓపెన్ అవుతుంది. అందులో కనీసం రూ.300 బెట్టింగ్ పెట్టమంటాడు. అలా పెడితే.. మొదటిసారి కనీసం రూ.600 వస్తా యి. ఆ డబ్బులతో మళ్లీ బెట్టింగ్ పెడితే.. విన్నిం గ్ అమౌంట్ పెరుగుతుంది. ఆ యాప్‌ల నిర్వాహకులు మనతో రూ.50 వేల వరకు బెట్టింగ్ పెట్టించి మొత్తాన్ని ఒకేసారి ఖతం చేస్తారు.
ఇన్ఫ్లూయెన్సర్లు చెప్పే బెట్టింగ్ యాప్‌లలో ఎంతో మంది యువకులు డబ్బులు కోల్పోతున్నారు. తక్షణ డబ్బుల కోసం అనధికారిక లోన్ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వకపోయినా రూ.10 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం ఇస్తుండటంతో ఆ యాప్‌ల నుంచి లోన్లు తీ సుకుంటున్నారు. అవి చెల్లించలేక, ఇంట్లో చెప్పుకోలేక, స్నేహితుల నుంచి తీసుకున్న అప్పులు తీర్చలేక మానసిక ఒత్తిడికిలోనై బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ గుడిమల్కాపూర్‌కు చెందిన 20 ఏండ్ల ఇంజినీరింగ్ విద్యార్థి ‘1విన్’ బెట్టింగ్ యాప్‌లో డబ్బులు కోల్పోవడంతో బయట చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత ఆ అప్పులన్నీ అతని తల్లిదండ్రులు తీర్చాల్సి వచ్చింది.
హైదరాబాద్‌కు చెందిన కాలేజీ విద్యార్థి శ్రీనివాస్‌కు ఖరీదైన బైక్‌లు, ఫోన్లు, వాచీలు అంటే ఇష్టం. అతడు సోషల్ మీడియాలో అభిమానించే ఓ ఇన్ఫ్లూయెన్సర్ (స్టార్) ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్‌ను ఇన్స్టాల్ చేశాడు. రూ.100 తో రీచార్జ్ చేసి, స్నేహితులకు రిఫర్ చేస్తే గివ్ అవే కింద యాపిల్ ఫోన్ ఇస్తానని ఆ స్టార్ చెప్పడంతో.. శ్రీనివాస్ ఫాలో అయ్యాడు. బెట్టింగ్ చేస్తూ క్రమంగా ఈజీమనీకి అలవాటు పడ్డాడు. మొదట్లో డబ్బులు వచ్చినా, ఆ తర్వాత పోవ డం మొదలైంది. దీంతో నిరక్షరాస్యులైన తన తల్లిదండ్రులను మోసగించి వారి అకౌంట్లోని డబ్బను సైతం బెట్టింగ్‌లో పెట్టి రూ.లక్షలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లాకు చెందిన సోమేశ్ వీడియోను చూసి రెండు వారాల తర్వాత జీతం కూడా మిగలకుండా బెట్టింగ్‌లో కోల్పోయాడు.
యువత జీవితాలను నాశనం చేస్తున్న యాప్‌లను ఇష్టారీతిన ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లపై పోలీసులు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం బెట్టింగ్ చాలా ప్రమాదకరంగా మారిందని, ఎంతోమంది యువకులు వీటికి బానిసలవుతున్నారని పోలీసులు చెప్తున్నా చర్యలు మాత్రం శూన్యం. ఎలాంటి రక్షణ లేని ఏపీకే ఫైల్స్, యాప్స్ డౌన్లోడ్ చేయడం వల్ల డాటాతోపాటు డబ్బులు కోల్పోతున్నారు.
అనధికారిక యాప్‌లను ప్రమోట్ చేయడంలో సోషల్ ఇన్ఫ్లూయెన్సర్లు బాధ్యతతో వ్యవహరించకపోవడంతో ఎంతో మంది యువత, వారి తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో రీల్స్ చేసేవారిని కట్టడి చేస్తున్నట్టే.. సోషల్ మీడియాలో ప్రమాదకర బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసేవారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు హెచ్చరికలు జారీచేస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.