హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కేసులో సినీనటి మంచు లక్ష్మి, ‘బిగ్‌బాస్’ కంటెస్టెంట్ రీతూ చౌదరి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్ మంగళవారం ఉదయం సిట్ విచారణకు హాజరయ్యారు. లక్డీకాపూల్‌లోని సీఐడీ కార్యాలయంలో అధికారులు వారిని విడివిడిగా ప్రశ్నించారు.
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల ఉపాధిని దెబ్బతీసేలా కేంద్రం ప్రభుత్వం ‘వీబీ-జీ రామ్ జీ’ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావడం హేయమని సీపీఐ నేత కే నారాయణ పేర్కొన్నారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కూరగాయల మార్కెట్లలో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఫస్సీ) ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రాథమికంగా హైదరాబాద్‌లోని 14 కూరగాయల మార్కెట్లను గుర్తించినట్టు అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వ్యాపారుల సౌలభ్యంకోసం ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మోదీ సర్కార్ ప్రమాదకరమైన నాలుగు చట్టాలకు ఆమోదముద్ర వేసుకున్నదని, వాటి పరిణామాలు దేశ ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగించబోతున్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హెచ్చరించారు. మంగళవారం ఎంబీ భవన్లో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు.