హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): బెట్టింగ్యాప్స్ నిషేధానికి కేంద్రం బిల్లు తీసుకురావడం సంతోషం కలిగించిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఎక్స్‌లో స్పందించారు. ‘#SayNoTo Bet tingApps ప్రభావవంతమైన ఉద్యమంగా ఎదిగినందుకు సంతోషంగా ఉన్నాను. హిందీ, తెలుగు, కన్నడ ఇతర భాషల్లోని ప్రముఖ సోషల్ మీడియా ప్రభావశీలురతో చేతులు కలిపాను. నాకు వచ్చిన కొన్ని సందేశాలు కండ్లల్లో నీళ్లు తెప్పించాయి. అవి మాటలకు అందనివి’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.