Betting Apps | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): బెట్టింగ్ యాప్‌లను ప్రమో ట్ చేశారన్న అభియోగాలతో ప్రముఖ సినీనటులు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌పై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయినట్టు తెలుస్తున్నది. చైనాకు చెందిన ఫన్88 అనే బెట్టింగ్ యాప్‌ను ప్ర మోట్ చేశారని, దానివల్ల ఎంతోమంది యువత ఆర్థికంగా నష్టపోయారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ప్రముఖ న్యాయవాది రామారావు తెలిపారు.
చైనా యాప్ నుంచి వచ్చిన డబ్బులను మ్యూల్ఖాతాల ద్వారా ముగ్గురు నటు లు విదేశాలకు మళ్లించారని రామారావు ఆరోపించారు. ఫిర్యాదుకు ఆధారాలను జత చేసినట్టు చెప్పారు. ఈ మేరకు పోలీసులు ముగ్గురు నటులపై కేసు నమోదు చేశారని తెలిపారు. తెలంగాణ గేమింగ్ సవరణ చట్టం-2017, డిజిటల్ మీడి యా కోడ్ కింద బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం నేరమని ఈ సంద ర్భంగా చెప్పారు. దేశ భద్రతకు ముప్పు గా మారిన బెట్టింగ్ యాప్స్, వాటి యాక్సెస్‌ను బ్లాక్ చేయాలని, బీఎన్ఎస్ చట్టాల కింద, ఐటీ యాక్ట్‌లోని 66 ఎఫ్, బీ సెక్షన్ల ప్రకారం సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను రామారావు అభ్యర్థించారు.