హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : సంస్కరణల ద్వారా ప్రజలకు మెరుగైన పోలీసింగ్‌ను చేపట్టాల్సి ఉందని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం ‘పోలీస్ సంస్కరణల ద్వారా మెరుగైన పోలీసింగ్’ అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ ఉన్నతాధికారులు పోలీస్స్టేషన్లు, కార్యాలయాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తే తక్షణమే కొంత మార్పు కనిపించే అవకాశముందన్నారు. తెలంగాణ పోలీస్‌శాఖను అగ్రభాగాన నిలిపేందుకు నూతన విధానాలను అవలంబిస్తున్నామని చెప్పారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో డీజీలు అభిలాషబిష్త్, శిఖాగోయల్, అదనపు డీజీలు సంజయ్‌కుమార్‌జైన్, స్వాతి లక్రా, ఐజీలు రమేశ్, చంద్రశేఖర్‌రెడ్డి, సత్యనారాయణ, రమేశ్‌నాయుడు, డీఐజీ గజరావు భూపాల్ పాల్గొన్నారు.