పోచమ్మమైదాన్, ఆగస్టు 18: వరంగల్ నగరంలోని కాశీబుగ్గకు చెందిన ‘నమస్తే తెలంగాణ’ తెలుగు దినపత్రిక ఫొటోగ్రాఫర్ మేరుగు ప్రతాప్ రాష్ట్రస్థాయిలో రెండు ఉత్తమ అవార్డులు పొంది అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఐఅండ్‌పీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో రెండు క్యాటగిరీల్లో ప్రతాప్‌కు ఈ అవార్డులు దక్కాయి. వరుసగా ఐదోసారి రాష్ట్రస్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా ఎంపిక కావడం గమనార్హం. ఈ మేరకు ఈనెల 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని గ్రీన్‌ల్యాండ్స్ హోటల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, కమిషనర్ సీహెచ్ ప్రియాంక, మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రతాప్ ఈ అవార్డులను అందుకోనున్నారు.