హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 7: రాష్ర్టంలో 30 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటున్న 200 బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు రాష్ర్ట ప్రభుత్వం రూ.180 కోట్ల ఫీజు బకాయి ఉందని, ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే స్పందించి ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యతును కాపాడాలని వినోద్‌కుమార్ కోరారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం హనుమకొండలోని వినోద్‌కుమార్ ఇంట్లో ఆయనతో పాటు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ను కలిసి సమస్యను వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను దసరా సెలవులు తర్వాత యాజమాన్యాలు స్కూల్స్‌కు అనుమతించడం లేదని, రాష్ర్ట ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే తప్ప తాము విద్యార్థులకు విద్యాబోధన చేయలేమని చేతులెత్తేస్తున్నారని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులను విడుదల చేస్తున్న రాష్ర్ట ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఫీరియింబర్స్మెంట్ను ఎందుకు చెల్లించడంలేదని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శోభన్ బాబు, రమేష్ బాబు, చింతల యాదగిరి ఉన్నారు.