TS Police | మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 2: తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక అధికారుల పెత్తనం కొనసాగుతున్నది. జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ కార్యాలయం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నది. మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల ఎస్పీలు, రాయిచూర్ ఎస్పీలతో జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఐజీపీ లోకేశ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. సరిహద్దు చెక్‌పోస్ట్‌లు, హైవేలపై తనిఖీలకు సంబంధించి సమావేశమయ్యారు. కాగా.. బళ్లారి ఐజీపీ వచ్చి మహబూబ్‌నగర్ డీఐజీ కుర్చీలో కూర్చొని సమీక్ష నిర్వహించడం గమనార్హం. కర్ణాటక అధికారులు వచ్చి తెలంగాణ పోలీసులను ఆదేశించడం విడ్డూరం.