Beeravelli | తెలంగాణలో మరో కొత్త మండలం ఏర్పాటుకానున్నది. నిర్మల్ జిల్లాలోని బీరవెల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ప్రైమరీ ఉత్తర్వులు జారీ చేసింది. పైరమూర్, తాండ్రా, వైకుంఠాపూర్, బీరవెల్లి, కంకట, వంజార్, చించోలి(ఎం), జ్వెలి, కల్వ గ్రామాలతో కలుపుతూ మండలంగా ఏర్పాటు చేయనున్నది. మొన్నటి వరకు ఆయా గ్రామాల్లన్నీ సారంగాపూర్ మండలాల్లో కొనసాగుతుండగా.. కల్వ గ్రామం మాత్రం దిలావర్పూర్ మండలంగా కొనసాగుతున్నది.
బీరవెల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేయడంపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పత్రిపాదిత మండలానికి చెందిన ప్రజలు మంత్రినికి కలిసి ధన్యవాదాలు చెప్పారు. నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం రెండు డివిజన్లు, 19 మండలాలున్నాయి. బీరవెల్లి సైతం మండలం కానుండడంతో మొత్తం సంఖ్య 20కి చేరినట్లయ్యింది.