ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామ సమీప గుట్టలపై ఉన్న వీఫాల్స్ (దూసపాటిలలొద్ది) జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తున్నది. 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. నీటిలో కేరింతలు కొడుతూ సందడి చేస్తున్నారు. వావ్ వీఫాల్స్ అంటూ సెల్ఫీలు దిగుతు ఎంజాయ్ చేస్తున్నారు.
-వాజేడు