Fake Calls | హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : ఫేక్కాల్స్తో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ సూచించారు. కొంతమంది ఏసీబీ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేయకుండా డబ్బు డిమాండ్ చేస్తూ వారిని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి ఘటనపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసు నమోదైనట్టు వెల్లడించారు. ఉద్యోగులపై కేసులు పెట్టకుండా ఉండేందుకు ఏసీబీ డబ్బులు అడగదని స్పష్టం చేశారు. ఎవరైనా నకిలీ కాల్స్ చేస్తే తక్షణం టోల్‌ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందించాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): దక్షిణాది రాష్ర్టాల్లో డ్రగ్స్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని, ఇందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జాతీయ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సదరన్ డైరెక్టర్ జీ వెంకటేశ్ సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, ఒడిశా రాష్ర్టాలకు చెందిన డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో పేరున్న కేసులపై సమీక్షించారు. సమావేశంలో టీజీన్యాబ్ డైరెక్టర్ సందీ ప్ శాండిల్య, ఎస్పీలు సాయి చైతన్య, రఘువీర్, సీతారామ్, పీ కృష్ణమూర్తి, పంకజ్కుమా ర్, ఆశిష్ చక్రవర్తి, సతీష్‌కుమార్, వికాస్ అగర్వాల్, రాజేశ్, ఎక్సైజ్ జేసీ వై ఖురేషి, పవన్‌కుమార్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.