KTR | హైదరాబాద్ : అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపార కోణంలో ఇది మంచి అవకాశమే అయినప్పటికీ కేవలం లాభాల కోసమే పని చేయొద్దని సూచించారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పిటల్లో నిర్వహించిన స్టార్టప్ ఛాలెంజ్ ఫినాలె-2023 కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో వ్యవస్థాపకులుగా మారడం అంత సులువు కాదు. వ్యాపారవేత్తలకు కావాల్సిన సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉంది. కొత్త సాంకేతికత గురించి చెప్పినప్పుడు సీఎం కేసీఆర్ ఎప్పుడు మాకు గుర్తు చేస్తుంటారు. ఆ సాంకేతికత సమాజంపై ఎంత ప్రభావం చూపిస్తుందని అడుగుతారు. సమాజంపై సానుకూల ప్రభావం చూపిస్తుందా? అని అడుగుతారు. కొత్త వ్యవస్థాపకులకు నేను రెండు విషయాలు చెబుతాను. ఒరిజినల్‌గా ఉండండి.. కాపీ చేయొద్దు. అమెజాన్‌ను చూసి ప్లిఫ్‌కార్ట్, స్నాప్‌డీల్ లాంటివి సృష్టించవచ్చు. ఇది చాలా సులభం. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే సృష్టించినవి కావు.. ప్రపంచ స్థాయికి చేరేలా కొత్త ఆవిష్కరణలు చేయండి. ఇప్పటికిప్పుడే వ్యవస్థాపకులుగా మారకపోవచ్చు. ప్రస్తుతం మూలధనం సమస్య కాదు. గతంలో మూలధనం సంపాదించాలంటే సవాల్‌గా ఉండేది. డబ్బును సమకూర్చుకుని, ఆ తర్వాత ఆలోచనను అమలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆలోచనే ముఖ్యం.. ఆ తర్వాతే మూలధనం. ఎంత తొందరగా మార్కెట్లోకి వస్తామనేది ముఖ్యం. ఒరిజినల్‌గా ఉండండి అని కేటీఆర్ సూచించారు.
🔑 Key suggestions by Minister @KTRBRS to innovators & entrepreneurs:
💡 Be original
🎉 Celebrate failures
🔍 Find solutions to everyday problems
🚀 Leverage innovation ecosystem in Hyderabad, including @THubHyd— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 15, 2023