మర్కూక్/ హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోశ్ ఆదివారం మొక్కలు నాటారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర సమీపంలోని శ్రీగాయత్రీ సాంగ వేద విద్యాలయాన్ని సందర్శించి వేద గురువుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.
అనంతరం వేద విద్యాలయ ఆవరణలో విద్యార్థులతో కలిసి మొకలు నాటారు. వేద విద్యాలయ నిర్వహణకు తనవంతు సాయ ంగా లక్ష రూపాయలు అందజేశారు. అక్కడి నుంచి నేరుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లికి చేరుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడే మొక్క నాటి నీళ్లుపోశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.