హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : నిజాయితీగా ఉండటమే కాకుండా అవినీతిని అడ్డుకోవాలని సింగరేణి ఈడీ(కోల్ మూవ్మెంట్), చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బీ వెంకన్న పిలుపునిచ్చారు. విజిలెన్స్ అనేది సమష్టి బాధ్యతగా ఆయన అభివర్ణించారు.
విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా సోమవారం రెడ్‌హిల్స్‌లోని సింగరేణి భవన్లో ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.