ఖైరతాబాద్, జూలై 9: 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న హైదరాబాద్‌లో బీసీ మహాధర్నా నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. వెనుకబడిన తరగతుల ప్రజాప్రతినిధుల వేదిక ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నా పోస్టర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు.
అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ చట్టసభల్లో ఎదిగితేనే బీసీ వర్గాలకు మనుగడ సాధ్యమవవుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీని ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని కోరారు. జీవో జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని చూస్తే అది బీసీలను మోసగించడమే అవుతుందని ధ్వజమెత్తారు.