హైదరాబాద్, జూన్ 13(నమస్తే తెలంగాణ): రాష్ట్ర విద్య, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మెయిల్ ఐడీ శ్రీబుర్రావెంకటేశం@జీమెయిల్.కామ్ హ్యాక్ అయిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెయిల్ ఐడీ ద్వారా కొందరు మోసగాళ్లు ఉద్యోగులు, సాధారణ ప్రజలకు మెయిల్స్ పంపుతూ డబ్బులు అడుగుతున్నారని, ఇటువంటి వాటికి స్పందించకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తిచేశారు.