సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 18: ప్రజాపాలన వేడుకలో ప్రొటోకాల్ పాటించని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ, కుల సంఘాలు, దళిత సంఘాల నాయకులు గురువారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు మాట్లాడారు.
సిరిసిల్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ ఆ ది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చి, జాతీయ గీతాలాపన చేస్తున్న క్రమంలో కలెక్టర్ కారు సైరన్‌తో వచ్చి అగౌరవపరిచారని ఆరోపించారు. కలెక్టర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.