ఎదులాపురం, జూలై 27 : కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర కుల గణన చేపట్టి మాట నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సమగ్ర కులగణన సాధన యాత్ర శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపించగానే కులగణన సాధ్యంకాదని ప్ర భుత్వం ప్రకటించడం సరికాదని అన్నా రు. సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచాలనే ప్రధాన డిమాండ్‌తో ఈనెల 14 నుంచి కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు సమగ్ర కులగణన సాధన యా త్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే సమగ్ర కులగణనను చేపట్టి బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతామని వరంగల్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇచ్చిన మాటను కాంగ్రెcలబెట్టుకోకపోతే ఆగస్టులో లక్ష మందితో హైదరాబాద్‌ను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.