హైదరాబాద్, డిసెంబర్13 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు బీసీ సంఘాలు అభినందనలు తెలిపాయి.
ఎంపీ గా ఎన్నికైనట్టు నియామక పత్రం అందుకున్న కృష్ణయ్యను బీసీ సంఘాల నేతలు గవ్వల భరత్‌కుమార్, గుజ్జ కృష్ణ, విద్యార్థి సంఘం నేత వేముల రామకృష్ణ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కృష్ణయ్యతోపాటు సానా సతీశ్, బీదా మస్తాన్‌రావు కూడా రాజ్యసభకు ఎన్నికయ్యారు.