హైదరాబాద్ : తెలంగాణలో మరో 4 బీసీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తిమ్మాపూర్, నర్సాపూర్, కమలాపూర్, మొగుల్లపల్లి గురుకుల పాఠశాలల స్థాయి పెంచారు. ఇక నుంచి ఈ నాలుగు గురుకులాల్లో ఇంటర్మీడియట్ విద్య అమల్లోకి రానుంది. తిమ్మాపూర్, నర్సాపూర్, కమలాపూర్‌లో బాలికల గురుకుల పాఠశాలలు కొనసాగుతుండగా, మొగుల్లపల్లిలో బాలుర గురుకుల పాఠశాల ఉంది. ఈ నాలుగు పాఠశాలల స్థాయి పెంచడంతో ఇంటర్ విద్యలో మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి.