BC Reservations | హైదరాబాద్ జూలై 20 (నమస్తే తెలం గాణ): సుప్రీంకోర్టు మార్గదర్శకాల ట్రిపుల్ టెస్ట్ పాసైతేనే తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోటా దక్కుతుందని తెలం గాణకు చెందిన మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి నరహరి స్పష్టంచేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ద్వారా బల హీనవర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. ఎవరైనా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చే రిజర్వేష న్లను కొట్టేసే అవకాశం ఉంటుందని వెల్లడిం చారు.
గతంలో బీహార్, జార్ఖండ్, మధ్యప్ర దేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఎదురైందని ఉదహరిం చారు. ఆదివారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంట ర్వ్యూలో నరహరి దేశవ్యాప్తంగా బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం, తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వే, భవిష్యత్తులో బీసీలు ఏవిధంగా ముందుకెళ్లాలి, దేశవ్యాప్తంగా చేప ట్టనున్న కులగణన తదితర అంశాలపై అభి ప్రాయాలు వెల్లడించారు. తెలంగాణలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కోటాకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచన నలు చేశారు. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న తరుణం లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు శాశ్వతంగా ఇవ్వడం సాధ్యంకాకపోవచ్చని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన మేరకు డెడికేటెట్ కమిషన్ ఏర్పాటు, సమ గ్రంగా కులాలవారీగా గణంకాలు, మొత్తంగా రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా చూడటం వంటి మార్గదర్శకాలు పాటించాల్సిన అవస రమున్నదని వివరించారు.
ఎలా నిర్ధారించారనేది ముఖ్యం
తెలంగాణలో కులగణన సర్వే ఏవి ధంగా జరిగిందనే విషయంపై తాను మాట్లాడబోనని, అయితే 42 శాతం బీసీ రిజర్వేషన్ కోటాను ఏ విధంగా నిర్ధారించా రనేది ముఖ్యమైనదని తెలిపారు. ఎందు కంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి, సమ గ్రంగా కులగణన నిర్వహించాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం మొదట డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయ కుండానే బీసీ కోటా కేటాయించేందుకు ప్రయత్నించిందని గుర్తుచేశారు. తర్వాత జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య కోర్టుకు వెళ్లిన తర్వాతనే.. రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషనన్ను నియమించిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎవరైనా కోర్టుకు వెళ్తే `42 శాతం కోటా ఎలా నిర్ధారించారు?’ అనే అంశంపై ప్రభావవంతంగా వాదనలు వినిపించాల్సి ఉంటుందని చెప్పారు. లేక పోతే కోర్టులో నిలవబోదని స్పష్టంచేశారు. తద్వారా బీసీల రిజర్వేషన్ అంశం మళ్లీ మొదటికొచ్చే అవకాశం ఉంటుందని అభి ప్రాయపడ్డారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయించాలి
తెలంగాణలో బీసీలకు ఇప్పటికిప్పుడు 42 శాతం కోటా దక్కాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని ఐఏఎస్ అధికారి నరహరి తెలిపారు. తెలంగాణ పంపించిన బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదిం చాల్సి ఉంటుందని చెప్పారు. చట్టబద్ధత కల్పించినప్పుడే 42 శాతం కోటా దక్కు తుందని స్పష్టంచేశారు. అయితే ఇది ఇప్ప టికిప్పుడు సాధ్యమయ్యే అవకాశాలు తక్కు వగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
మధ్యప్రదేశ్ మోడల్ ఉత్తమం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం అనివార్యమైనందున.. చట్ట బద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అంత సులువు కాదని నరహరి చెప్పారు. ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కోటా కేటాయింపు అసాధ్యమని పునరుద్ఘాటిం చారు. అయితే స్థానిక సంస్థల్లో కోటా ఇచ్చేందుకు మధ్యప్రదేశ్ మాడల్‌ను అనుస రించాలని సూచించారు. దీని ప్రకారం గ్రామం, మండలం, జిల్లా యూనిట్‌గా తీసుకొని జనాభా దామాషా ప్రకారం బీసీ లకు సీట్లు కేటాయించడం ద్వారా 42 శాతం కాకున్నా బీసీలకు గతం కంటే ఎక్కు వగా సీట్లు ఇచ్చే వీలు కలుగుతుందని తెలి పారు. అయితే ఈ విధానం కూడా తాత్కా లికమని స్పష్టంచేశారు.
జనగణనలో కులగణన గేమ్‌చేంజర్
కేంద్ర ప్రభుత్వం. 2026లో జనగణనలో భాగంగా చేసే కులగణన బీసీలకు గేమ్‌చేంజర్‌గా మారుతుందని నరహరి అభిప్రాయ పడ్డారు. 1931 తర్వాత కులాల వారీగా లెక్కలు తీయడం, ఇదే మొదటిసారి అని చెప్పారు. కులాలవారీగా వివరాలు తెలిస్తే బలహీనవర్గాలందరూ ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తద్వారా రాజకీయపార్టీలు అనివా ర్యంగా పంథా మార్చుకుంటాయని అభిప్రా యపడ్డారు. అంతిమంగా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు బల హీనవర్గాలకు దక్కుతాయని తెలిపారు.
బీసీలు సంఘటితం కావాలి
దేశవ్యాప్తంగా బీసీల్లో చైతన్యం కనిపిస్తు న్నదని ఐఏఎస్ అధికారి నరహరి తెలి పారు. అంతిమంగా రాజ్యాధికారంతోనే తగిన న్యాయం జరుగుతుందనే విషయాన్ని గ్రహించి, చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం బీసీలు పోరాడాలని సూచించారు. తెలంగాణలో బలహీనవర్గాలు విడివిడిగా తమ డిమాండ్లను పాలకుల ముందుంచితే ప్రయోజనం ఉండదని, రాజకీయాల్లో, విద్య, ఉద్యోగాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్ ఫలాలు దక్కాలంటే బీసీలందరూ ఏకతా టిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైం దని తెలిపారు. జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న రెండు, మూడు కులాలైనా సంఘటితంగా ఉంటూ మిగిలిన వర్గాలను కలుపుకొని పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు.