హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సోమవారం బీసీ రణభేరి మహాసభ నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 డిమాండ్లతో నిర్వహించే ఈ సభకు అన్నిపార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రైవేటు రంగంలోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. కేంద్రం చేపట్టబోయే జనగణనలో కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్చేశారు.