ఖైరతాబాద్, జూన్ 6: రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న తలపెట్టిన సచివాలయ ముట్టడిని జయప్రదం చేయాలని బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం బీసీ జనసభ, బీసీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ‘కామారెడ్డి డిక్లరేషన్-సమగ్ర కులగణన’ అనే అం శంపై బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాంయాదవ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాజ్యసభ స భ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రా జ్యాంగంలో ఒక వర్గానికి ఇంతే ఇవ్వాలని ఎక్కడా చెప్పలేదని, ఇప్పటికే బీహార్‌లో 70 శాతం, తమిళనాడులో 70 శా తం రిజర్వేషన్లు ఉన్నట్టు బీసీల లెక్కలు తేల్చారని చెప్పారు.
ఎన్నికల్లో బీసీలు పోటీ చేసినప్పుడు వారికి ఓట్లు పడటం లేదని, బీసీల ఓట్లు ఎక్కడికి పో తున్నాయ్.. ఎవరు తీసుకుపోతున్నారు అనే విషయాలను గమనించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. రాజారాంయాదవ్ మాట్లాడుతూ.. ఈ నెల 15న తలపెట్టిన సెక్రటేరియట్ ముట్టడికి బీసీలందరూ అత్యధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గిరిజన రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ సంజీవ్‌నాయక్, ఆలిండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సా యినరేందర్, హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్, అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ కార్యదర్శి రమేశ్‌యాదవ్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు రమణకుమార్, టీ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, న్యాయవాద జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు లొడంగి గోవర్ధన్, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.