హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావును రాష్ట్ర బీసీ సంఘం నేతలు శనివారం ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బీసీల్లోని చేతివృత్తిదారులు, కులవృత్తిదారులకు ఆధునిక పనిముట్లు, ముడిసరుకు ల కొనుగోలుకు ప్రభుత్వం లక్ష ఆర్థికసాయం అందించడంపై హర్షం ప్రకటించారు. జాతీ య విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. మంత్రిని కలిసినవారిలో సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్యాదవ్, నేతలు జగదీశ్గౌడ్, రావిచారి, హేమంత్, సాయిరాహుల్ తదితరులు ఉన్నారు.