హైదరాబాద్, డిసెంబర్8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం వెంటనే స్పందిం చి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, లేకుంటే 10వ తేదీన కలెక్టర్లు, ఎమ్మార్వో కార్యాలయాలను ము ట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జా తీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసి మీడియాకు విడుదలచేశారు. బకాయిలు చె ల్లించాలని రాష్ట్రంలోని 1800 కాలేజీలు బంద్ చేపట్టాయని, అయినా సర్కారు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అనేక స్కీములు, కాంట్రాక్టర్ల కు వేలకోట్ల బిల్లులు చెల్లిస్తున్న ప్రభు త్వం వద్ద.. విద్యార్థుల మెస్ బిల్లులు, సాలర్షిప్లు చెల్లించేందుకు బడ్జెట్ లే దా? అని ప్రశ్నించారు. ఇకనైనా ప్రభు త్వం స్పందించి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ల ముట్టడిలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.