ఫీజు బకాయిలు చెల్లించకుంటే ఉద్యమం ఉధృతం
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి ఆర్ కృష్ణయ్య సంఘీభావం తెలిపి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి సర్కార్ ఫీజు బకాయిలు చెల్లించకుండా 14లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని ధ్వజమెత్తారు.
- బీసీ నేత ఆర్ కృష్ణయ్య హెచ్చరిక
ఖైరతాబాద్, ఆగస్టు 25 : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి ఆర్ కృష్ణయ్య సంఘీభావం తెలిపి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి సర్కార్ ఫీజు బకాయిలు చెల్లించకుండా 14లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై సీఎం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని, పథకాన్ని యథావిధిగా కొనసాగించి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మోదీ రాందేవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లకు వేల కోట్ల బకాయిలు చెల్లిస్తున్న ప్రభుత్వం, ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్లకు నిధులు లేవనడం దారుణమని పేర్కొన్నారు. కలెక్టరేట్ ముట్టడి పోలీసులు, విద్యార్థుల మధ్య కాసేపు తోపులాట జరిగింది. కార్యక్రమంలో నిఖిల్ పటేల్, నీలం వెంకటేశ్, అనంతయ్య, రాజేందర్, నరేష్‌గౌడ్, అంజిగౌడ్, శివయాదవ్, చిల్లర యశ్వంత్, బాలయ్య నరేశ్‌చారి, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

