హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్తు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోడెపాక కుమారస్వామి, ముత్యం వెంకన్న గౌడ్ బుధవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. తెలంగాణ విద్యుత్తు సంస్థలు ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సమీక్షించి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని కోరారు. విద్యుత్తు సంస్థల్లో సీఎండీ, డైరెక్టర్ పోస్టుల్లో 50 శాతం పదవులను బీసీ కులాల అధికారులతో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.