ఖైరతాబాద్, జూలై 18: రాష్ట్ర ప్రభు త్వం బీసీలకు మొండిచేయి చూపించే ప్రణాళికతో ఉన్నదని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని పేర్కొన్నా రు. సమగ్ర కుల గణన, 42 శాతం రిజర్వేషన్లపై రెండు నెలలుగా బీసీ జనసభ, బీసీ కులాలు, సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి సో యి రావడం లేదని విమర్శించారు.
మొక్కుబడిగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి చేతులు దులుపుకున్నారని, ప్రణాళికబద్ధమైన కార్యాచరణకు ప్రయత్నం చేయడం లేదని మండిపడ్డారు. ఇప్పటికి ఏడు నెలలు కాలయాపన చేశారని, ఇప్పుడు చట్టపరమైన సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులతో కేసులు వేయించి, రాజ్యాంగ సంక్షోభం నెపంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా కుట్రలు చేస్తున్నట్టు తమ వద్ద సమాచారం ఉన్నదని తెలిపారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న వైఖరి, ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని పేర్కొన్నారు.
ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. కులగణన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, మా జీ మంత్రి జానారెడ్డి సలహాలు తీసుకోవాలని సెలవిచ్చారని అన్నారు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 65 సీట్లు కేటాయించాలని, కానీ ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం కనీసం 34 సీ ట్లు రావాలని, కాని 20 మాత్రమే ఇచ్చారని, అందులోనూ ఓడిపోయే పాతబస్తీ సీటును బీసీకి ఇచ్చారని అన్నారు. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వ స్పష్టమైన వైఖరి ప్రకటించకుంటే త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామ ని హెచ్చరించారు.
సమావేశంలో హిం దూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్లు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ ముదిరాజ్, న్యాయవాద జేఏసీ అధ్యక్షుడు గోవర్ధన్, ఎంబీసీ సంఘం జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, అంబేద్కర్ యువజన సంఘం జాతీయ సభ్యు డు నరహరి, విద్యార్ధి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి రాజు, ఓయూ విద్యార్ధి సంఘాల జేఏసి అధ్యక్షుడు లింగం, తెలంగాణ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు బారి అశోక్ పాల్గొన్నారు.