హైదరాబాద్, ఏప్రిల్18 (నమస్తే తెలంగాణ) : బీసీ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సంబంధించి ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి సైదులు ప్రకటనలో తెలిపారు. మొత్తం 6,832 బ్యాగ్ లాగ్ సీట్లుండగా, 26,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు రాష్ట్రవ్యాప్తంగా 109 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించునున్నామని పేర్కొన్నారు. అందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు.