Degree Admissions | హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరానికి అర్హత సాధించిన విద్యార్థుల జాబితా వెబ్సైట్లో అందుబాటులో ఉందని సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు తమ సీటు కేటాయింపు స్థితిని అధికారిక వెబ్సైట్ https://tgrdccet. cgg.gov.in/TGRDCWEB/ or https:// mjptbcwreis.telangana. gov.in ద్వారా తెలుసుకోవచ్చు అని పేరొన్నారు.
సీటు కేటాయింపు పొందిన విద్యార్థులు 30 నుంచి జూన్ 6 లోగా కేటాయించిన కళాశాలకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లు ఇచ్చి అడ్మిషన్ పొందాలని సూచించారు. గడువులోగా హాజరు కాకపోతే సీటు రద్దు అవుతుందని వెల్లడించారు. ఇది మొద టి జాబితా మాత్రమే అని, ఇంకా ఖాళీ సీట్లు ఉంటే మరిన్ని కేటాయింపులు చేస్తామని తెలిపారు. మొదటి జాబితాలో సీటు రాకపోయిన విద్యార్థులు తదుపరి జాబితాను వెబ్సైట్లో చూడవచ్చని స్పష్టంచేశారు. వివరాల కోసం 040-23328266 నంబర్‌కు లేదా mjptbcwreis14@gmail. comకు మెయిల్ పంపించాలన్నారు.