హైదరాబాద్, మే1 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ సర్కారు చేసిన బిల్లులను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చే శారు. జనాభా గణనతోపాటు కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు.
ఇప్పటికే కులగణన నిర్వహించి.. బీసీలకు స్థానికసంస్థలు, విద్యా, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్ను కల్పిస్తూ బిల్లులను చేసిందని వివరించారు. జాతీయస్థాయిలో కులగణన జరిగే వరకూ ఆ బి ల్లులను ఆపొద్దని, తెలంగాణను ఒక స్పెషల్ కేసుగా పరిగణించి బిల్లులకు చట్టరూపం కల్పించాలని కో రారు.ఈ విషయంలో చొరవచూపాలని నిరంజన్ సూచించారు.
దశాబ్దాలుగా ఓబీసీలు చేస్తున్న అలుపెరగని పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కులగణనకు అంగీకరించిందని, ఇది ఓబీసీల విజయమని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగాల్లో బీసీల రిజర్వేషన్ను పెంచాలని, చట్టసభల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని కోరారు.