రాష్ట్ర బీసీ సంఘం, జేఏసీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు ఆదివారం వనపర్తిలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభ జనం లేక వెలవెలబోయింది. సభా ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో కనిపించింది. జనం రాకపోవడంతో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ రాత్రి 7 గంటలకు మొదలైనది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతుండగా కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. -వనపర్తి