హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ ఓబీసీ కులగణనపై నోరు విప్పాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్యాదవ్ డిమాండ్ చేశారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న బహిరంగ సభలో బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మోదీ తన ప్రసంగంలో ఓబీసీ సమస్యలపై స్పందించకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.