హైదరాబాద్, ఆగస్టు8 (నమస్తే తెలంగాణ): గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుతో బీసీ సంఘాల నేతలు శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఓబీసీ జాతీయ మహాసభలో పాల్గొనేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు గో వా తరలివెళ్లారు. ఈ సందర్భంగా గోవా రాజ్‌భవన్‌లో గవర్నర్ అశోక్ గజపతిరాజును శాలువాతో సతరించారు. బీసీల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.