హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ)ః తెలంగాణ ఫారెస్ట్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నేషనల్ వైల్డ్‌లైఫ్ వీక్, బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పర్యావరణం, వన్యప్రాణుల ప్రాధాన్యం, ప్రకృతి వనరుల విశిష్టతను వెల్లడించేలా వివిధ రంగులతో ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో విద్యార్థులు రంగవల్లిని తీర్చిదిద్దారు. దీన్ని రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్, సీఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ డీన్ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్ శోభ అభినందించారు.