విద్యుత్తు స్టోరేజీ ప్లాంట్లపై అభ్యంతరాలు.. రాష్ట్రంలో 1,500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ ప్లాంట్లు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ప్లాంట్ (బెస్)లపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే పలువురు నిపుణులు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలు తెలియజేసి, సర్కార్ తీరును తప్పుబట్టారు.
- మహేశ్వరం, చౌటుప్పల్‌లో ఏర్పాటుకు అనుమతి
- వాటి నుంచి విద్యుత్తు కొనుగోలు చేసేందుకు ఈఆర్సీ అనుమతి కోరిన జెన్కో, డిస్కమ్‌లు
- అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నిపుణులు
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ప్లాంట్ (బెస్)లపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే పలువురు నిపుణులు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలు తెలియజేసి, సర్కార్ తీరును తప్పుబట్టారు. రాష్ట్రంలో 1,500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. పబ్లిక్ సెక్టార్ డీ కార్బనైజేషన్ స్కీమ్ (పీఎస్డీఎస్)లో భాగంగా ట్రాన్స్‌కోకు చెందిన సబ్స్టేషన్లల్లోని ఖాళీ స్థలాల్లో ‘బిల్డ్-ఓన్ అండ్ ఆపరేట్’ పద్ధతిలో ఈ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. చౌటుప్పల్, మహేశ్వరంలో 750 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన 2 ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. 15 ఏండ్ల కాలపరిమితితో ఈ ప్లాంట్ల ఏర్పాటుకు టీజీ జెన్కో టెండర్లు పూర్తిచేసింది. దీంతో ఈ ప్లాంట్ల నుంచి 1,500 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు దక్షిణ, ఉత్తర డిస్కమ్‌లు ఈఆర్సీ అనుమతి కోరాయి. ఇందుకు సంబంధించిన పిటిషన్లపై ఈఆర్సీ త్వరలో బహిరంగ విచారణ జరుపనున్నది. ఈ విచారణ సందర్భంగా పలువురు విద్యుత్తు రంగ నిపుణులు ఈఆర్సీ ముందు తమ వాదనలు వినిపించనున్నారు.
అనేక అభ్యంతరాలు, ప్రశ్నలు
- ఈఆర్సీ నుంచి డిస్కమ్‌లకు అనుమతి రాకముందే టీజీ జెన్కో టెండర్లను పిలువడంతోపాటు బిడ్డర్లను ఎంపిక చేసి లెటర్ ఆఫ్ అవార్డును కూడా జారీచేసింది. ఆ తర్వాత టారిఫ్ ఆమోదం కోసం మరో పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ విధానం నియంత్రణ ప్రక్రియ పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తున్నది. కమిషన్ అనుమతిని డిస్కమ్‌లు నామమాత్రంగా భావిస్తున్నట్టు అనిపిస్తున్నది. పైగా ఖరారు చేసిన టారిఫ్‌లు మన పక్క రాష్ట్రమైన ఏపీ కంటే అధికంగా ఉన్నాయి.
- విద్యుత్తు కొనుగోలు కోసం డిస్కమ్‌లకు ఈఆర్సీ అనుమతి ఇవ్వకముందే జెన్కో టెండర్లను ఎలా పూర్తి చేస్తుంది? ఈఆర్సీ అనుమతిస్తుందని ముందే ఎలా ఊహించుకుంటుంది?
- రాష్ట్రంలో పవర్ కో-ఆర్డినేషన్ కమిటీ ఎటువంటి కమీషన్ లేకుండా డిస్కమ్‌ల కోసం విద్యుత్తు కొనుగోలు చేస్తున్నది. ఈ తరుణంలో 7 పైసల ట్రేడింగ్ మార్జిన్ ఎవరి కోసం? వినియోగదారులపై అదనపు భారాన్ని మోపేలా 15 ఏండ్ల కాలంపాటు యూనిట్‌కు 7 పైసల చొప్పున ట్రేడింగ్ మార్జిన్ చెల్లించాల్సిన అవసరం ఏమిటి?
- బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ప్లాంట్లను టీజీ జెన్కో నెలకొల్పకుండా మధ్యవర్తిగా వ్యవహరిస్తూ కమీషన్ రూపంలో ఆదాయం పొందే ప్రయత్నం చేయడం దారుణం.
- ఈ ప్లాంట్లకు కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండ్‌ను సమకూరుస్తున్నది. అలాంటప్పుడు డిస్కమ్‌లే ప్లాంట్లను నెలకొల్పే అవకాశం ఉన్నప్పటికీ ప్రైవేట్ సంస్థలకు ఎందుకు ఇస్తున్నట్టు?
- సౌర విద్యుత్తును తప్పనిసరిగా వినియోగించాల్సిందే. ఒప్పందాల ప్రకారం మొత్తం విద్యుత్తును కొనుగోలు చేయాల్సిందే. అలాంటప్పుడు సౌర విద్యుత్తును బ్యాటరీ స్టోరేజీ ప్లాంట్‌లో ఎలా నిల్వ చేస్తారు?
ఈఆర్సీ సమగ్ర పరిశీలన జరుపాలి
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం ప్రాజెక్ట్‌పై తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి సమగ్ర పరిశీలన జరుపాలి. అభ్యంతరాలు తెలిపేందుకు ఇచ్చిన సమయం సరిపోదు. వీజీఎఫ్ అర్హత కోసం రెండు గడువులు పూర్తయ్యాయి. అయినా ప్రక్రియను గడువులోగా పూర్తిచేయడంలో డిస్కమ్‌లు, సర్కార్ విఫలమయ్యాయి. వేర్వేరు పిటిషన్ల ద్వారా విడివిడిగా అనుమతులివ్వడం ప్రజాప్రయోజనాలకు అనుకూలం కాదు.
– వేణుగోపాల్‌రావు, సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

