హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ పండుగ సందర్భంగా ఈనెల 27న ట్యాంక్‌బండ్‌పై ‘బతుకమ్మ కార్నివాల్’ నిర్వహించనున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
ఈనెల 28న బైక్, సైకిల్ ర్యాలీలు, 29న సరూర్‌నగర్ స్టేడియంలో 10వేల మంది మహిళలతో బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, 30న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వంటి పలు కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం మంత్రులు కొండా సురేఖ, సీతక్కతోపాటు సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.