హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యం లో తెలంగాణభవన్‌లో శనివారం బతుకమ్మ సంబురాలు మిన్నంటాయి. టీఆర్ఎస్ మహి ళా విభాగం అధ్యక్షురాలు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి, మూల విజయారెడ్డి, సుశీలారెడ్డి తదితర మహిళా నేతలతో మధ్యాహ్నం నుంచే తెలంగాణభవన్‌లో సంద డి మొదలైంది. కార్పొరేటర్లు, మహిళా నేతలు శ్రీదేవి, దుసరి లావణ్యాశ్రీనివాస్గౌడ్, శ్రీ దేవి, హేమా, రోజాదేవి, శైలజ, లలిత, కాంచన బతుకమ్మ పాటలు పాడారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.