తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో శనివారం సింగపూర్‌లో జూమ్ యాప్ ద్వారా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీసీఎస్ఎస్ 13 ఏండ్లుగా బతుకమ్మ పండుగను పెద్దఎత్తున సింగపూర్‌లో కొనసాగిస్తున్నది. ఈ సందర్భంగా మిస్ యూనివర్స్ సింగపూర్ 2021గా గెలిచిన తెలుగు అమ్మాయి నందిత బన్నను సొసైటీ సభ్యులు సత్కరించారు. బతుకమ్మ పేర్చిన ప్రతిఒక్కరికీ బహుమతులు అందజేశామని సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్ తెలిపారు. కార్యక్రమంలో టీసీఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్‌రెడ్డి, కోశాధికారి లక్ష్మణ్‌రాజు కల్వ, సంస్థాగత కార్యదర్శి గడప రమేశ్‌బాబు, ఉపాధ్యక్షుడు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్‌రెడ్డి, సునీతరెడ్డి, భాస్కర్ గుప్తా నల్ల, ప్రాంతీయ కార్యదర్శులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.