హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఆవరణలో గురువారం సాయంత్రం మహిళా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఉత్సాహంగా బతుకమ్మ పండుగ జరుపుకొన్నారు. సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో మండలి ప్రొటెం చైర్మన్ వీ భూపాల్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పీవీ వాణీదేవి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, సీతక్క, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.