హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలను ఎండగడతామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్) అధ్యక్షుడు కేవీ జాన్సన్, ప్రధాన క్యాదర్శి కోడూరి ప్రకాశ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు ఉన్న ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేక, ముఖ్యమంత్రిని నేరుగా ఎదుర్కోలేక.. ఎమ్మెల్సీ కవితపై కేంద్రం సీబీఐ ముసుగులో నిరాధార ఆరోపణలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సోమవారం సంఘం ప్రతినిధి బృందం ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా జాన్సన్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో బీఆర్ఎస్తో తీవ్రమైన పోటీ ఉంటుందని గ్రహించి కొన్నిరోజులుగా తమ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిరాధార ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు.