బాసర, అక్టోబరు 8 : నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన మంగళవారం సరస్వతీ అమ్మవారు(Basara Ammavaru )కాత్యాయని( Katyayani) రూపంలో దర్శనం ఇచ్చారు. భక్తులు తమ చిన్నారులకు అక్షర శ్రీకారపూజలు జరిపించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ అధికంగా ఉండడంతో దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా, బుధవారం మూలనక్షత్ర పూజలు నిర్వహించనున్నారు. మూల నక్షత్ర పూజలను పురష్కరించుకొని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ గ్యారెంటీలు అబద్దమని హర్యానా ప్రజలు గ్రహించారు : కేటీఆర్
Harish Rao | ఆ వీడియోలో తప్పేముంది..? జర్నలిస్ట్ గౌతమ్‌ను వెంటనే విడుదల చేయాలి : హరీశ్‌రావు