తప్పుడు పత్రాలతో బ్యాంకులో రుణాలు
తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకులో రుణాలు తీ సుకున్న వ్యక్తులను సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవా రం రిమాండ్‌కు తరలించారు. ఆర్సీపురం ఇన్స్పెక్టర్ నరేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. స్థానిక జ్యోతినగర్ వద్ద ఉన్న ఆంధ్రాబ్యాంకు ప్రస్తు తం యూనియన్ బ్యాంకులో కొందరు వ్యక్తు లు 2016లో వివిధ కంపెనీల పేరిట రుణాలు తీసుకున్నారు.
- కంపెనీల యజమానుల నిర్వాకం
- 2016లో అప్పటి ఆంధ్రాబ్యాంకులో 27 కోట్లు
- 12 మందిని రిమాండ్ చేసిన ఆర్సీపురం పోలీసులు
రామచంద్రాపురం, ఫిబ్రవరి 20: తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకులో రుణాలు తీ సుకున్న వ్యక్తులను సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవా రం రిమాండ్‌కు తరలించారు. ఆర్సీపురం ఇన్స్పెక్టర్ నరేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. స్థానిక జ్యోతినగర్ వద్ద ఉన్న ఆంధ్రాబ్యాంకు ప్రస్తు తం యూనియన్ బ్యాంకులో కొందరు వ్యక్తు లు 2016లో వివిధ కంపెనీల పేరిట రుణాలు తీసుకున్నారు.
బ్యాంక్‌కు సమర్పించిన పత్రా ల్లో పలు లోపాలు ఉన్నా, అప్పటి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఫీల్డ్ అధికారి, వ్యాల్యూయేషన్ అధికారి, ఆడిటర్ అవేమి పట్టించుకోకుండా ఒక్కో కంపెనీకి రూ.1.80 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు రుణాలు మంజూరు చేశా రు. రుణాలు తీసుకున్న వారు రెండేండ్లపాటు ఈఎంఐ చెల్లించారు.
ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ మారడంతో తర్వాత వచ్చిన మేనేజర్ రుణాలను రెన్యువల్ చేయకపోవడంతో ఈఎం ఐ చెల్లించడం ఆపేశారు. కంపెనీల పత్రాలు సరిగ్గా లేవని అధికారులు 2021లో గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులకు ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్‌ని 2023 లో సమర్పించడంతో దాని ప్రకారం రుణాలు తీసుకున్న యజమానులను, రుణాలు మం జూరు చేసిన బ్యాంకు అధికారులు మొత్తం 12 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

