Bandla Ganesh : మూసీ సుందరీకరణపై రోజుకో మాట మారుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సినిమా నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh) విమర్శలు గుప్పించారు. ప్రజా వ్యతిరేకత వస్తున్నా ముందుకే వెళ్లాలనుకుంటున్న సీఎం ఇప్పుడు గుడి, మసీదు, చర్చిల ప్రస్తావన తేవడాన్ని ఆయన ప్రశ్నించారు. ‘ఓసారి గుడి అంటావ్ ఓసారి గాంధీ విగ్రహం, చర్చి, మసీదు.. ఇలా ఏవోవో చెబుతున్నావ్. ఇంతకూ నీ ప్లాన్ ఏంటన్నా’ అని సీఎంను బండ్ల విమర్శించారు.
‘లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ అంటావ్. కాసేపు గాంధీ సరోవర్ అంటావ్. కాసేపు రూ.5,000 కోట్లతో గాంధీ విగ్రహం అంటావ్. నిన్న 700 కోట్లతో ఓంకారేశ్వర గుడి అంటావ్. శివలింగం అంటావ్. ఇవాళ రూ.2,500 కోట్లతో మసీదు అంటావ్. గురుద్వారా అంటావ్. చర్చి అంటావ్. వీటితో మూసీ శుద్ధి ఎలా సాధ్యం అవుతుంది? నాకైతే అర్ధం కావట్లేదు. నువ్వే చెప్పన్నా నీ ప్లాన్ ఏంటో?’ అని సీంఎం రేవంత్‌పై బండ్ల గణేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అసలు నీ ప్లాన్ ఎంటన్నా
లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ అంటావ్
కాసేపు గాంధీ సరోవర్ అంటావ్
కాసేపు 5000 కోట్లతో గాంధీ విగ్రహం అంటావ్నిన్న 700 కోట్లతో ఓంకారేశ్వర గుడి అంటావ్
శివలింగం అంటావ్
ఇవాళ 2500 కోట్లతో మసీదు అంటావ్
గురుద్వారా అంటావ్
చర్చి అంటావ్వీటితో మూసీ శుద్ధి ఎలా… https://t.co/GljM1xzhag pic.twitter.com/O5vENpQEj0
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2026