కరీంనగర్ : అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) అన్నారు. కరీంన గర్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. అమృత్ పథకం అక్రమాలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారిస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కోరుకుపోయిందని, కొంతమంది కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందన్నారు. హైడ్రాకి వ్యతిరేకం కాదని నిస్పాక్షికంగా కూల్చివేతలు జరగాలన్నారు. తిరుమల లడ్డు కల్తీ వివాదంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దృష్టి సారించారని అన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.