కవాడిగూడ, మే 13 : పోక్సో కేసులో బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు మల్లు లక్ష్మి, చైతన్య మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి, పీవోడబ్ల్యూ జాతీయ అధ్యక్షురాలు సంధ్య, జాతీయ నాయకురాలు ఝాన్సీ, ఏఐఎంఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి హేమలత, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకురాలు ఎస్ఎల్ పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదై వారం రోజులు కావస్తున్నా ఇంతవరకూ అరెస్టు చేయకపోవడం దారుణమని తెలిపారు. నిరసన కార్యక్రమంలో మహిళా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.