కరీంనగర్ విద్యానగర్, జూన్ 19: కేంద్ర మంత్రి పదవి కరీంనగర్ ప్రజలు, కార్యకర్తలు పెట్టిన భిక్షేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కేంద్ర మంత్రి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి బుధవారం కరీంనగర్ వచ్చిన ఆయనకు స్థానిక నేతలు ఘనస్వాగతం పలుకగా కరీంనగర్ కమాన్ వద్ద నేలపై ప్రణమిల్లారు. అకడి నుంచి చైతన్యపురిలోని మహాశక్తి అమ్మవారు, కొండగట్టు అంజన్న, కొడిమ్యాల మండలం నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు.